National31st Aug 12:49 PMSunil Byrisetty1 min read
భారత్- చైనా సంబంధాలపై మోదీ
చైనాలో భారత ప్రధాని పర్యటన సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. తియాజింగ్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస
చైనాలో భారత ప్రధాని పర్యటన సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. తియాజింగ్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. దీనికి ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోదీ భేటీ అయ్యారు. అమెరికా సుంకాల బాదుడు నేపథ్యంలో వీరి భేటీ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చైనాతో సానుకూల సంబంధాలు కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. గతేడాది రష్యాలోని కజన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో జిన్పింగ్ జరిగిన సమావేశం గురించి ఆయన ఇక్కడ ప్రస్తావించారు. నాడు తమ భేటీ ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు బాటలు వేసిందన్నారు. ఇరుదేశాల మధ్య సహకారంతో దాదాపు 2.8 బిలియన్ల మంది ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.