National30th Aug 05:37 PMSunil Byrisetty1 min read

చైనా గడ్డపై మోదీ ల్యాండ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా టారిఫ్ విధిస్తూ భారత్ ను బెంబేలెత్తిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే అందరి దృష్టీ నిలిచింది. ఆయన ఎటువంట

చైనా గడ్డపై మోదీ ల్యాండ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా టారిఫ్ విధిస్తూ భారత్ ను బెంబేలెత్తిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే అందరి దృష్టీ నిలిచింది. ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? తదుపరి చర్యలు ఎలా ఉండబోతోన్నాయనేది చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ కు చెక్ పెట్టనున్నారు ప్రధాని మోదీ. శత్రుదేశం చైనాతో మిత్రత్వాన్ని పెంపొందించు కుంటోన్నారు. కొద్దిసేపటి కిందటే చైనాలో ల్యాండ్ అయ్యారు. రెండు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని నేరుగా చైనాకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఈ క్రమంలో చైనా సుప్రీమ్ గ్జి జిన్ పింగ్ తో ముఖాముఖి భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలపై చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొననున్నారు. టియాన్జియాన్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. రెడ్ కార్పెట్ పరిచింది అక్కడి ప్రభుత్వం. ఓ దేశ ప్రధాని లేదా అధ్యక్షుడికి ఎయిర్ పోర్ట్ లో రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం అరుదు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ చైనాలో అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
International Trade
Donald Trump Tariffs
Narendra Modi China Visit
India-US Trade Tensions
Xi Jinping Meeting
Shanghai Cooperation Organisation (SCO) Summit
India-China Relations
Global Diplomacy
Scroll for the next article