News27th Sep 01:03 PMSunil Byrisetty1 min read
అక్టోబర్ 16న ఏపీకి ప్రధాని నరేంద్రమోదీ
అక్టోబర్ 16న ఏపీకి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. మోదీ పర్యటన వివరాలను శాసనమండలి లాబీలో మంత్రి లోకేష్ సహచర మంత్రులు, ఎమ్మెల్సీలకు వివరించారు. జీఎస్టీ సంస్కరణలపై కర్నూల్ లో మోదీ, చ
అక్టోబర్ 16న ఏపీకి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. మోదీ పర్యటన వివరాలను శాసనమండలి లాబీలో మంత్రి లోకేష్ సహచర మంత్రులు, ఎమ్మెల్సీలకు వివరించారు. జీఎస్టీ సంస్కరణలపై కర్నూల్ లో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్న మోదీ తొలుత శ్రీశైలంలో మల్లన్న దర్శనం చేసుకోనున్నారు. అనంతరం కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతలు రోడ్ షో నిర్వహించనున్నారు.