News20th Aug 09:14 AMSunil Byrisetty1 min read

బీసీ డీ కుల ధ్రువీకరణతో నగరాలకు మేలు

రాష్ట్రంలో నగరాల అభివృద్ఢికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవ

బీసీ డీ కుల ధ్రువీకరణతో నగరాలకు మేలు
రాష్ట్రంలో నగరాల అభివృద్ఢికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను నగరాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ల తిరుమలేశ్, ఆ సామాజిక వర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ముందు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ కు, మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలియజేశారు. నగరాలందరికీ ఒకేలా బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు అందుకునే అవకాశం కలిగిందన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలకు బీసీ-డీ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆదేశించామన్నారు. గతంలో కేవలం ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాలో మాత్రమే నగరాలకు బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసేవారన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ నగరాలందరికీ బీసీ-డీ కులధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారన్నారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు అందే అవకాశం నగరాలకు కలిగిందన్నారు.
Andhra Pradesh Government
Chandrababu Naidu
Minister Savitha
BC Welfare
EWS Welfare
Urban Development
Nagaralu Community
Caste Certificates
బీసీ సంక్షేమం
ఈడబ్ల్యూఎస్ సంక్షేమం
Scroll for the next article