Health12th Aug 04:19 PMSunil Byrisetty1 min read
ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ అభా ఐడీతో చికిత్స
జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల మేరకు ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ రోగులకు అభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) ఐడీ ఆధారంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్
జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల మేరకు ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ రోగులకు అభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) ఐడీ ఆధారంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ బోధనాసుపత్రులతో పాటు ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పటికే అభా ఐడీ ఆధారంగా సేవలు అందిస్తున్నామని, దీనివల్ల రోగుల ఆరోగ్య వివరాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు (ఈహెచ్‌ఆర్) రూపొందుతున్నాయని తెలిపారు. ఎన్ఎంసీ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు వైద్య కళాశాలల్లో అభా ఐడీల ఆధారంగా వైద్య సేవలు అందించే ప్రక్రియను వెంటనే అమలు చేయాలని వీరపాండియన్ కోరారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో కార్యశాల నిర్వహించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 5.04 కోట్ల అభా ఖాతాలు సృష్టించగా, వాటికి అనుసంధానంగా 12.7 కోట్ల ఆరోగ్య రికార్డులు నమోదయ్యాయని తెలిపారు. రోగి ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్లినా సంబంధిత ఆరోగ్య వివరాలు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్లో నమోదవుతాయని చెప్పారు.