News27th Oct 10:57 AMSunil Byrisetty1 min read
వణికిస్తున్న ట్రావెల్ బస్సులు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు దగ్ధమై 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే పలు చోట్ల బస్సులు అదుపు తప్పుతున
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు దగ్ధమై 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే పలు చోట్ల బస్సులు అదుపు తప్పుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం కుంట మధ్య నిన్న రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంది. మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కొట్టాలపల్లి గ్రామ మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురైనప్పటికీ, డ్రైవర్ సకాలంలో బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.