Politics19th Dec 04:33 PMSunil Byrisetty1 min read

మోదీ ఇచ్చిన టీ పార్టీలో ప్రియాంక గాంధీ

ఢిల్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం, సంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్యులకు టీ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుర

మోదీ ఇచ్చిన టీ పార్టీలో ప్రియాంక గాంధీ
ఢిల్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం, సంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్యులకు టీ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. మరోవైపు, ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయి, తన నియోజకవర్గమైన వయనాడ్‌లోని రహదారుల సమస్యలపై చర్చించారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Indian Politics
Congress
BJP
Nitin Gadkari
Priyanka Gandhi
Narendra Modi
Tea Party
Parliament Session
Delhi Politics
Wayanad
Supriya Sule
Opposition Leaders
Political News
Viral Photos
Scroll for the next article