Celebrity Family30th Aug 09:36 AMSunil Byrisetty1 min read
అల్లు అర్జున్ ఇంట్లో విషాదం మాతృ వియోగం
అల్లు అర్జున్ ఇంట విషాదం నెలకొంది. అల్లు అర్జున్ నాయనమ్మ, అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె శనివార
అల్లు అర్జున్ ఇంట విషాదం నెలకొంది. అల్లు అర్జున్ నాయనమ్మ, అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. విషయం తెలియగానే చిరంజీవి కుటుంబం అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్లు షూటింగ్ నిమిత్తం మైసూర్, ముంబయిలో ఉన్నారు. మధ్యాహ్నం వారు హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం.