News8th Nov 02:58 PMSunil Byrisetty1 min read

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన నిర్మాత సి.అశ్వినీద‌త్

వైజయంతీ మూవీస్ అధినేత‌, ప్ర‌ముఖ నిర్మాత చ‌ల‌సాని అశ్వినీద‌త్ శనివారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం,

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన నిర్మాత సి.అశ్వినీద‌త్
వైజయంతీ మూవీస్ అధినేత‌, ప్ర‌ముఖ నిర్మాత చ‌ల‌సాని అశ్వినీద‌త్ శనివారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ కి విచ్చేసిన నిర్మాత సి.అశ్వినీద‌త్ కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం ప‌లికారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఛాంబ‌ర్ లో వున్న టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు, కేడీసీసీ బ్యాంక్ చైర్మ‌న్ నెట్టెం ర‌ఘురామ్, మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న‌ల‌ను కూడా నిర్మాత సి.అశ్వినీద‌త్ క‌లవ‌టం జ‌రిగింది. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోసం ఎంపీ కేశినేని శివ‌నాథ్ చేస్తున్న‌ కృషిని నిర్మాత సి.అశ్వినీద‌త్ అభినందించారు. ఏసీఏ అధ్య‌క్షుడిగా రాష్ట్రంలో క్రికెట్ రంగం అభివృద్ది కోసం కేశినేని శివ‌నాథ్ ఎన‌లేని సేవ‌లు అందిస్తున్నార‌ని కొనియాడారు. అనంత‌రం వీరంతా క‌లిసి స‌ర‌దాగా కాసేపు రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు, సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ది కోసం చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌ గురించి చ‌ర్చించుకున్నారు.
Andhra Pradesh
Ashwini Dutt
Kesineni Sivanath
Vyjayanthi Movies
TDP
Vijayawada
క్రికెట్ అభివృద్ధి
సినీ పరిశ్రమ
రాజకీయాలు
సమావేశం
Scroll for the next article