News16th Aug 03:21 PMSunil Byrisetty1 min read

దుర్గమ్మ సేవలో నిహారిక!

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మవారిని నిర్మాత కొణిదెల నిహారిక దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమ

దుర్గమ్మ సేవలో నిహారిక!
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మవారిని నిర్మాత కొణిదెల నిహారిక దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన నిర్మాత నిహారికకు దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
Andhra Pradesh
Niharika Konidela
Kanaka Durga Temple
Vijayawada
Indrakeeladri
Durga Malleswara Swamy Temple
ప్రత్యేక పూజలు
భక్తి
టాలీవుడ్
సినీ నిర్మాత
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article