News30th May 10:27 AMSunil Byrisetty1 min read
రెరా ఫిర్యాదులను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి అందే ఫిర్యాదులను అన్నింటినీ ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించి, వారి నుంచి సంతృప్తి లేఖను తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి అందే ఫిర్యాదులను అన్నింటినీ ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించి, వారి నుంచి సంతృప్తి లేఖను తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు. కొనుగోలు దారులకు ఎటు వంటి అన్యాయం జరుగకుండా అన్ని లేఅవుట్లను, నిర్మాణాలను రెరా (RERA) పరిధిలోకి తీసుకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాన మంత్రి మోడీ బుధవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించి జాతీరు ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా దేశ ప్రధాని మాట్లాడుతూ రెరా చట్టాన్ని పటిష్టంగా అమలు పర్చాలని, అది రెగ్యులేటరీ అథారిటీ మాత్రమే కాదని, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను ప్రమోట్ చేసే సంస్థ అని కూడా అనే విషయాన్ని గుర్తించాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో సెమీకండక్టర్ ఎకో సిస్టమ్‌ను పెంచుతూ పారదర్శకతతో కూడిన మంచి పాలన ప్రజలకు అందజేయాలన్నారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, ఝూర్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన వారణాసి – రాంచీ – కొల్కొటా జాతీయ రహదారి ఎన్.హెచ్.-319బి పురోగతిపై ప్రధాని సమీక్షిస్తూ జాతీయ ప్రాజెక్టులను సత్వరమే అమలు పర్చే అంశంపై అన్ని రాష్ట్రాల సి.ఎస్.లు ప్రత్యేక చొరవ చూపాలని, లేకుంటే ప్రాజక్టుల నిర్మాణ వ్యయం పెరిగిపోతుందనే విషయాన్ని సి.ఎస్.లు అందరూ గుర్తించాలన్నారు.