News2nd Oct 02:18 PMSunil Byrisetty1 min read
స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలి
గాంధీ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నివాళులు అర్పించారు. అనంతరం
గాంధీ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ బొమ్మ వద్ద మన ఇంట స్వదేశీ - ఇంటింటా స్వదేశీ పేరుతో ఏర్పాటు చేసిన ఖాదీ సంత ను ఆయన పరిశీలించి వారి సతీమణి కోసం చీరను కొనుగోలు చేశారు. అజీజ్ మాట్లాడుతూ, స్వలాభం కోసం కాకుండా సమాజం కోసం బతికిన మహానుభావులను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామ స్వరాజ్యం నెరవేరాలని, గ్రామాల్లో అభివృద్ధి జరిగి వారి స్వశక్తిపైనే నడిచేలా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మొన్నటి వరకు స్వదేశీ వస్తువులు విదేశాలకు అమ్ముతున్నామని గర్వంగా చెప్పుకునే వారమని, ట్రంప్ విధించిన టారిఫ్లు అత్యంత దారుణమని అన్నారు. ఒక వ్యక్తి ఆలోచనల వల్ల దేశాలు ఇబ్బంది పడే పరిస్థితులు రాకూడదని అన్నారు. మనం ఉత్పత్తి చేసే వస్తువులు మనమే వినియోగించాలని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లది అదే ఆలోచన అని అన్నారు. అదే ఆలోచన ఉత్పత్తిదారుల్లో వచ్చిందని వినియోగదారుల్లో కూడా రావాలని అన్నారు. మేకిన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా పురోగతి బాగుందని ప్రజలు స్వదేశీ వస్తువులపై మరింత మక్కువ చూపాలని అన్నారు.