Jobs28th Sep 10:13 AMSunil Byrisetty1 min read

ఆ ఉద్యోగుల పదోన్నతులకు లైన్ క్లియర్

స్వర్ణ వార్డులో పనిచేస్తున్న నాలుగు కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ ఆమోదంతో ప్రమోషన్ చానల్స్ పై జీవో - 244 జారీ చేశామని పురపాలక, పట్టణాభ

ఆ ఉద్యోగుల పదోన్నతులకు లైన్ క్లియర్
స్వర్ణ వార్డులో పనిచేస్తున్న నాలుగు కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ ఆమోదంతో ప్రమోషన్ చానల్స్ పై జీవో - 244 జారీ చేశామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు (గ్రేడ్- II), వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులకు ప్రమోషన్లు లభించనున్నాయి. మొత్తం 3,260 ఉద్యోగులు ప్రమోషన్ల ద్వారా లబ్ధి పొందుతారని తెలిపారు. అధికారుల కమిటీ సిఫార్సులు అందిన వెంటనే మిగిలిన మరో రెండు కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లపై ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
Scroll for the next article