News20th Aug 09:05 AMSunil Byrisetty1 min read

మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్లు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ కార్యకర్తల అప్‌గ్రేడేషన్ చేపడుతోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన 4687 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌

మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్లు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ కార్యకర్తల అప్‌గ్రేడేషన్ చేపడుతోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన 4687 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. వీరి గౌరవ వేతనం నెలకు రూ.11,500 గా నిర్ణయించారు. అలాగే 340 మిని అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలలో విలీనం చేయనున్నారు. ఆ కేంద్రంలో లబ్ధిదారులు 10 కంటే తక్కువగా ఉండాలి. అలాగే ఆ కేంద్రం సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రానికి కిలోమీటరు లోపు అందుబాటులో ఉండాలి. ఈ ప్రక్రియ రాబోయే 4 సం.ల్లో దశల వారీగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Andhra Pradesh Government
Mini Anganwadi Workers
Anganwadi Promotions
Welfare Schemes
Women Employment
Child Care Centers
Anganwadi Upgradation
అంగన్వాడీ ప్రమోషన్లు
మహిళా ఉపాధి
Scroll for the next article