News18th Dec 11:37 AMSunil Byrisetty1 min read

కోవూరులో స్పోర్ట్స్ కాంప్లెక్స్

కోవూరు నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా ఉన్న అంశాలపై కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమరావతి సచివాలయంలో రాష్ట్ర రవాణా, యువజ, క్రీడాశాఖ మంత్రి మండి

కోవూరులో స్పోర్ట్స్ కాంప్లెక్స్
కోవూరు నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా ఉన్న అంశాలపై కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమరావతి సచివాలయంలో రాష్ట్ర రవాణా, యువజ, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా ఇండుకూరుపేటలోని ఎం.కె.ఆర్ హైస్కూల్ ఆవరణలో ఉన్న 5.70 ఎకరాల భూమిలో రూ.400 లక్షల అంచనా వ్యయంతో సమగ్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ క్రీడా సముదాయం ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఆధునిక క్రీడా సదుపాయాలు అందుబాటులోకి వచ్చి, క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా గతంలో మంజూరైనప్పటికీ ఇప్పటివరకు పూర్తి కాకుండా నిలిచిపోయిన విడవలూరులోని ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం, కొడవలూరులోని ఏపీటిడబ్ల్యుఆర్ఐఈఎస్ పాఠశాలలో స్టేడియం, ఆట మైదానాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. పనుల ఆలస్యం వల్ల విద్యార్థులు, యువ క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
Andhra Pradesh
Kovuru
Kovuru Constituency
Sports Complex
Youth and Sports
Sports Infrastructure
Rural Youth
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
సమగ్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్
యువత అభివృద్ధి
Scroll for the next article