News7th Jan 03:40 PMSunil Byrisetty1 min read
రాజానగరంలో జూపార్కు ఏర్పాటుకు ప్రతిపాదన
ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూపార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. బుధవారం రాజానగరం మండల పరిధిలోని దివాన్ చెరువులో
ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూపార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. బుధవారం రాజానగరం మండల పరిధిలోని దివాన్ చెరువులో ఉన్న అటవీ భూమిని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని, సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం త్వరలో కార్యాచరణ రూపకల్పన చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాంత భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అనుకూలతలపై కేంద్ర పరిశీలన కోసం వొచ్చిన సభ్యులతో కలిసి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయడం జరిగిందన్నారు. ప్రకృతి పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమని తెలిపారు. ప్రస్తుతం రాజానగరంలో సుమారు 311 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉందని, అందులో 250 హెక్టార్ల భూమిని జూపార్కు కోసం వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఆఫీసర్ బెన్ నేతృత్వంలోని బృందాన్ని రాజానగరానికి పంపినట్లు ఎంపీ దగ్గుబాటి వివరించారు.