News26th Oct 11:49 AMSunil Byrisetty1 min read
ఏపీలో కొత్తగా మూడు రహదారులకు ప్రతిపాదనలు
ఏపీలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మూడు ప్రధాన మార్గాలను జాతీయ రహదారులుగా ప్రకట
ఏపీలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మూడు ప్రధాన మార్గాలను జాతీయ రహదారులుగా ప్రకటించేందుకు ఏపీ రోడ్లు–భవనాల శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నిర్ణయం ఆమోదం పొందితే జిల్లా రవాణా వ్యవస్థ పూర్తిగా మారనుంది. అల్లూరి జిల్లా ప్రధాన కేంద్రం పాడేరు రాష్ట్రంలోని ఇతర ముఖ్య ప్రాంతాలతో అనుసంధానం కానుంది. మూడు రహదారుల్లో, సబ్బవరం–పాడేరు మార్గం 90 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే రింతాడ–చింతూరు వరకు 150 కిలోమీటర్ల రహదారి, చింతలవీధి–ముంచంగిపుట్టు వరకు 65 కిలోమీటర్ల మార్గాన్ని కూడా జాతీయ రహదారులుగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ మార్గాలు పూర్తయ్యాక జిల్లాలో రవాణా సౌకర్యం మరింత సులభం అవుతుంది. ఇంకా పాడేరు–ముంచంగిపుట్టు మీదుగా ఒడిశాకు వెళ్లే మార్గాన్ని నేషనల్ హైవేగా అభివృద్ధి చేస్తే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు రవాణా చాలా సులభం అవుతుందని అధికారులు చెబుతున్నారు.