Agriculture10th Jun 05:17 PMSunil Byrisetty1 min read
తుఫాను ముప్పు తప్పేలా ముందుగానే సాగునీరు
ఖరీఫ్ పంటలను తుఫాన్ల నుంచి రక్షించుకునేలా పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకు అనుగుణంగా గ
ఖరీఫ్ పంటలను తుఫాన్ల నుంచి రక్షించుకునేలా పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకు అనుగుణంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశారు. అధికారులు ఈ మేరకు వివరాలను మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రికి తెలిపారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా ఇప్పటికే నీరు విడుదల చేశామని, జూలై మొదటివారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. అలాగే రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, ప్రత్తిసాగు చేస్తుండగా... వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతూ వస్తోందని, కందుల సాగుమాత్రం పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు.