Agriculture5th Nov 02:50 PMSunil Byrisetty1 min read
జీవ ఎరువులతో భూమాతకు రక్ష
రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువులను (బయో ఫెర్టిలైజర్స్) ప్రోత్సహించాలని, వీటిని విరివిగా వాడేలా రైతుల్ని చైతన్య పరచాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచిం
రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువులను (బయో ఫెర్టిలైజర్స్) ప్రోత్సహించాలని, వీటిని విరివిగా వాడేలా రైతుల్ని చైతన్య పరచాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి భూమాత రక్షణ కమిటీ (మదర్ ఎర్త్ ప్రొటెక్షన్ కమిటీ) సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ... నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం భూమాత రక్షణ కార్యక్రమాన్ని (మదర్ ఎర్త్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం) చేపట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లా, సబ్ డివిజన్, గ్రామస్థాయిలలో వివిధ శాఖల అధికారులతో భూమాత రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. 12వ తేదీ నాటికి కమిటీలను ఏర్పాటుచేసి గ్రామసభలు నిర్వహించాలని సూచించారు.
గ్రామాల వారీగా, సొసైటీల వారీగా ఎరువుల వినియోగాన్ని పరిశీలించాలన్నారు. రైతులకు రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించాలని చెప్పారు. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు.