News2nd Sep 01:13 PMSunil Byrisetty1 min read
న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ధర్నా
న్యాయవాదుల వృత్తి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల నుంచి రక్షణ కల్పించేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ (న్యాయవాదుల రక్షణ చట్టం) ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప
న్యాయవాదుల వృత్తి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల నుంచి రక్షణ కల్పించేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ (న్యాయవాదుల రక్షణ చట్టం) ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి బాపట్ల న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.
ఈ మేరకు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు న్యాయవాదులు విధులను బహిష్కరించి బాపట్ల కోర్టు సముదాయం ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విన్నకోట సత్య ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కంచర్ల అవినేష్ జాయింట్ సెక్రటరీ టి. రామకృష్ణ, ట్రెజరర్ నాగమోహిని తదితరులు పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
న్యాయవాదుల వృత్తిపరమైన భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.