News18th Jun 05:16 PMSunil Byrisetty1 min read

పనిగంటల పెంపును వ్యతిరేకిస్తూ 20న ఆందోళన

అనేక ప్రాణత్యాగాలు పోరాటాలతో సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రాష్ట్రంలో 10 గంటలకు పెంచడానికి వ్యతిరేకిస్తూ జూన్ 20న రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఆందోళ

పనిగంటల పెంపును వ్యతిరేకిస్తూ 20న ఆందోళన
అనేక ప్రాణత్యాగాలు పోరాటాలతో సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రాష్ట్రంలో 10 గంటలకు పెంచడానికి వ్యతిరేకిస్తూ జూన్ 20న రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన పది గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం 26 వేలు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆలోచన మేరకు సంపద సృష్టి పెట్టుబడిదారులు చేస్తున్నప్పుడు, కార్మికుల పని గంటలు పెంచాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పగటి పూటే భద్రత లేని సామాజిక పరిస్థితులలో రాత్రిళ్ళు పనిచేసే శ్రామిక మహిళల భద్రతకు ఎవరు బాధ్యత అని ప్రశ్నించారు. నిర్బంధంగా అధిక పనిగంటల పని చేయించడంవల్ల కార్మికుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అనేక శాస్త్రీయ పరిశోధనలు తెలుపుతున్నాయని తెలిపారు. సమిష్టి కుటుంబ జీవన విధానానికి కార్మికుడు దూరమయ్యి కుటుంబాలు విచ్చిన్నం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Andhra Pradesh news
CM Chandrababu
Naga subbaReddy
protests against 10 work hours
10 గంటలకు వ్యతిరేకిస్తూ 20న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
Scroll for the next article