International7th Apr 01:54 PMSunil Byrisetty1 min read

ట్రంప్‌కు వ్యతిరేకంగా 50 రాష్ట్రాల అమెరికన్ల నిరసన!

డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల పట్ల వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ట్రంప్, మ

ట్రంప్‌కు వ్యతిరేకంగా 50 రాష్ట్రాల అమెరికన్ల నిరసన!
డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల పట్ల వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ ఆందోళనలలో పాల్గొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక జరిగిన అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇదేనని అక్కడి రాజకీయ వర్గాలు తెలిపాయి. ముందుచూపు లేకుండా ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు జరుగుతాయని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయంపైనా నిరసన వ్యక్తం చేశారు. ‘హ్యాండ్స్ ఆఫ్!’ పేరుతో దేశవ్యాప్తంగా 1,200 పైగా ప్రదేశాలలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘ట్రంప్ గో బ్యాక్’, ‘హాండ్స్ ఆఫ్ డెమోక్రసీ’, ‘మస్క్ వాస్ నాట్ ఎలెక్టెడ్’ వంటి నినాదాలతో వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, మయామీ వంటి నగరాల్లోని స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు.
Against 50 States
US President Trump
Anti Trump Protest
ట్రంప్ గో బ్యాక్
హాండ్స్ ఆఫ్ డెమోక్రసీ
మస్క్ వాస్ నాట్ ఎలెక్టెడ్
Scroll for the next article