News28th Sep 12:57 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వ అనుమతి లేకుండా ధర్నా చేస్తామంటే సహించం
గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి DBV స్వామి అన్నారు. సచివాలయ ఉద్యోగులను స్ట్రీమ్‌లైన్ చేశామని, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లన
గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి DBV స్వామి అన్నారు. సచివాలయ ఉద్యోగులను స్ట్రీమ్‌లైన్ చేశామని, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామని వివరించారు. డిమాండ్లను పరిష్కరించినా.. వాళ్లు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలీదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనల వెనుక ఎవరున్నారో తేలుతుందన్నారు. సర్వీస్‌రూల్స్ లేకుండా గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే.. మేం సరిచేస్తున్నామన్నారు. సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం అసాధ్యమని, నోషనల్ ఇంక్రిమెంట్లు ఎవరికీ లేవని, మీకు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి డిమాండ్లు సాధిస్తామంటే సరికాదని, ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులు ధర్నా చేస్తామంటే సహించమని చెప్పారు. రూ.15 వేలతో కొందరు ఉద్యోగులు రెండేళ్లు ఉద్యోగం చేశారని, అప్పుడు ఏమీ మాట్లాడలేదని అన్నారు. ఇప్పుడు ఆందోళన చేస్తారా అని, ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా.. జగన్ వ్యవహరించవద్దని మంత్రి డా. స్వామి పేర్కొన్నారు.