Politics2nd Nov 03:41 PMSunil Byrisetty1 min read

రాప్తాడు బాలికకు రూ. 50 లక్షలివ్వాలి

రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్ర గాయాలైన బాలికను బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. జడ్పీ హైస్కూల్లోనో దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో బడిక

రాప్తాడు బాలికకు రూ. 50 లక్షలివ్వాలి
రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్ర గాయాలైన బాలికను బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. జడ్పీ హైస్కూల్లోనో దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో బడికి వెళ్లే పిల్లల పరిస్థితేంటని ప్రశ్నించారు. ఇలాంటి దాడులకు కారణం రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, గంజాయి విస్తృతంగా అందుబాటులోకి రావడమేనన్నారు. వీటిని అరికట్టే విషయంలో ప్రభుత్వం ఫెయిలైనందుకు తలదించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదం వల్ల జరిగిన ఈ ఘటనలో బాలిక కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వైద్యానికి సంబంధించి పూర్తిగా బాధ్యత తీసుకోవాలని, ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోకపోతే పార్టీపరంగా అన్ని రకాలుగా అండగా ఉండి వైద్యం చేయిస్తుందని డిమాండ్ చేశారు. ఆపరేషన్ జరిగిన తర్వాత బాలిక ప్రమాదం నుంచి బయటపడిందని వైద్యులు చెబుతున్నారు, 48 గంటల తర్వాత మరింత స్పష్టత వస్తుందని జగన్ తెలిపారు.
Scroll for the next article