News3rd Dec 12:17 PMSunil Byrisetty1 min read

ప్రజాచైతన్యంతోనే డిజిటల్ అరెస్ట్‌లకు చెక్!

డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసులను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టు పేరుతో లక్షల మందిని మోసం చేశారు. ఇంకా

ప్రజాచైతన్యంతోనే డిజిటల్ అరెస్ట్‌లకు చెక్!
డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసులను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టు పేరుతో లక్షల మందిని మోసం చేశారు. ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. మోసపోయిన వారిలో బాగా చదువుకున్న వారు ఉన్నారు. వ్యాపారస్తులు ఉన్నారు. ఎక్కువ మంది పెద్ద వాళ్లు ఉన్నారు. వేలకోట్లు వీరి వద్ద నుంచి గుంజుకున్నారు. ఈ మోసాలు అంతకంతకూ పెరిగిపోవడం.. కట్టడి చేయలేకపోవడంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. కానీ ఇలాంటి మోసాలను అరికట్టాలంటే..రెండే మార్గాలు ఒకటి డేటా దుర్వినియోగం కాకుండా చూడటం.. రెండు ప్రజలను చైతన్యపరచడం అని స్పష్టం చేసింది. ఓ వ్యక్తిని డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేయాలనుకుంటే వారి మొత్తం సమాచారం.. మోసగాళ్ల వద్ద ఉంటోంది. ఫోన్ నెంబర్ , పిల్లల వివరాలు, ఆన్ లైన్ లో పెట్టిన ఆర్డర్లు, ఆర్థిక లావాదేవీలు ఇలా సమగ్ర సమాచారం ఉంటోంది. ఇదంతా వారి వద్దకు ఎలా చేరుతోందన్నది ప్రధానమైన ప్రశ్న. సరైన డేటా పాలసీ లేకపోవడం.. తప్పుడు పద్దతుల్లో డేటా అమ్ముకునే కంపెనీలు ఉండటంతోనే ఇది సాధ్యమవుతుంది. డార్క్ వెబ్ లో ఇలాంటి డేటాను అమ్ముతామని బహిరంగంగా ప్రకటనలు ఉంటూ ఉంటాయి. మోసగాళ్లకు ఇదే పెద్ద ఆయుధంగా మారింది.
digital arrest scams
Supreme Court orders
CBI investigation
data misuse
cyber fraud
public awareness
online scams
మోసాల నివారణ
డేటా ప్రైవసీ
సైబర్ క్రైమ్
స్కామ్ అవగాహన
ఆర్థిక మోసాలు
సైబర్ సెక్యూరిటీ
Scroll for the next article