News14th Sep 03:41 PMSunil Byrisetty1 min read

మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సెప్టెంబర్ 15 సోమవారం జిల్లా, మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక

మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సెప్టెంబర్ 15 సోమవారం జిల్లా, మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చునన్నారు. అదే విధంగా అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి *Meekosam.ap.gov.in* (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చును. అలాగే వారి అర్జీల నమోదు, నమోదైన అర్జీల గురించి వాటి స్థితికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 కి నేరుగా కాల్ చేయవచ్చని కూడా తెలియజేసారు.
Andhra Pradesh Government
Public Grievance Redressal
Chadalawada Nagarani
District Collector
Meekosam Portal
Citizen Services
Helpline 1100
ఫిర్యాదు పరిష్కారం
హెల్ప్‌లైన్
ప్రజా సంక్షేమం
Scroll for the next article