News4th Aug 09:24 AMSunil Byrisetty1 min read

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నేడు కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నేడు కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం కార్యక్రమం జరుగుతుందని ఇన్చార్జి కలెక్టర్ వివరించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో అందజేయవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక –మీకోసం కాల్ సెంటర్ నంబర్ 1100 కు ప్రజలు ఎవరైనా సరే కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతోపాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్ సైట్ లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.
Andhra Pradesh
Meekosam
Public Grievance Program
Krishna District
Machilipatnam Collectorate
Geetanjali Sharma
Citizen Services
Meekosam Call Center
Public Welfare
ప్రజా ఫిర్యాదులు
మచిలీపట్నం కలెక్టరేట్
Scroll for the next article