News16th Jan 01:47 PMSunil Byrisetty1 min read

విద్యుత్ చార్జీలపై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) ఈనెల 20వ తేదీ నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజిం

విద్యుత్ చార్జీలపై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ
విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) ఈనెల 20వ తేదీ నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీఈఆర్సీ చైర్మన్ పి.వి.ఆర్.రెడ్డి అధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని తిరుపతి, విజయవాడ, కర్నూలులో నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) పై 20న తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలోనూ, 22, 23 తేదీల్లో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనూ, 27న కర్నూలులోని ఏపీఈఆర్సి కార్యాలయంలోనూ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆయా రోజుల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, తిరిగి 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అభిప్రాయాలు తెలియజేయదలుచుకున్న వారు నేరుగా ఆయా వేదికల వద్ద పాల్గొనవచ్చని, నేరుగా పాల్గొనలేని వారికోసం జిల్లాల్లోని సమీప విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం లేదా డివిజన్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
Andhra Pradesh
Electricity Tariffs
APERC
Public Hearing
Power Sector
APSPDCL
టారిఫ్ ప్రతిపాదనలు
రాష్ట్ర ప్రభుత్వం
శక్తి నియంత్రణ
ప్రజా విచారణ
Scroll for the next article