Politics11th Aug 05:45 PMSunil Byrisetty1 min read

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీలకు జరుగుతున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగబోతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విధ్వంసాలు, అక్రమాలు జరుగుతున్నాయని మాజీ సీఎం, పులివెందుల

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీలకు జరుగుతున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగబోతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విధ్వంసాలు, అక్రమాలు జరుగుతున్నాయని మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే అనడం విడ్డూరమన్నారు. విలువలు పాటించని జగన్ విలువల గురించి మాట్లాడటం సిగ్గుపడాల్సిన అంశమని దుయ్యబట్టారు. పులివెందుల ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడం అంటే ఏంటో కూటమి ప్రభుత్వంలో నేడు ప్రజలకు తెలిసిందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. పులివెందులలో ఎప్పుడూ ఏకగ్రీవాలే. నామినేషన్ పత్రాలు చింపేయడం, బెదిరించడం సాధారణంగా జరిగేవని ఆరోపించారు. పులివెందులకు సంబంధించి 11 మంది నామినేషన్ వేశారంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయనేది అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh politics
Pulivendula elections
Ontimitta ZPTC
Vangalpudi Anita
peaceful elections
YSRCP
opposition criticism
democratic process
local body polls
ప్రశాంత ఎన్నికలు
వైఎస్సార్సీపీ
Scroll for the next article