Politics11th Aug 10:52 AMSunil Byrisetty1 min read
పులివెందుల ఉప ఎన్నిక.. రంగలోకి పోలీస్!
కడప జిల్లా పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 6 చెక్ పోస్టులతో పాటు 3 బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద వాహనాలను అణువణువూ క్షుణ
కడప జిల్లా పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 6 చెక్ పోస్టులతో పాటు 3 బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద వాహనాలను అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తన్నారు. 12న పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా ఎస్.పి ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది రంగలోకి దిగారు. అద్దాలమర్రి బార్డర్ చెక్ పోస్ట్, అంబక పల్లి బార్డర్ చెక్ పోస్ట్, పార్నపల్లి బార్డర్ చెక్ పోస్ట్ లతో పాటు కణం పల్లి చెక్ పోస్ట్, నలగొండు వారి పల్లి, రాయలాపురం, చందమామ దాబా, అలవలపాడు రోడ్ సర్కిల్, ఎర్రిపల్లి చెక్ పోస్ట్ ల వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది వాహనాలను అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. పెద్దమొత్తంలో నగదు, బంగారు లేదా ఇతర విలువైన వస్తువులు, మద్యం, ఓటర్లను ప్రలోభ పెట్టే వస్తువుల తరలింపుపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు.