News14th Dec 05:30 PMSunil Byrisetty1 min read

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21న పల్స్ పోలియో!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఈనెల 21న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐద

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21న పల్స్ పోలియో!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఈనెల 21న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న 54,07,663 మంది పిల్లలకు 38,267 బూత్‌ల్లో పోలియో చుక్కలు వేసేందుకు 61.26 లక్షల డోస్‌లను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, మేళాలు, బజార్లు, పర్యాటక ప్రదేశాల్లో 1140 బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. 21న పోలియో దినం సందర్భంగా బూత్‌ స్థాయిలో పిల్లలకు పోలియో చుక్కల్ని వేస్తారని, ఆ రోజు ఏదైనా కారణంతో పోలియో చుక్కలు వేసుకోలేక పోయిన పిల్లలకు 22, 23 తేదీల్లో 76,534 బృందాలు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తాయని వివరించారు. 1704 మంది వైద్యాధికారులు, 39,494 మంది ఇతర సిబ్బంది, 4206 మంది పర్యవేక్షకులు కార్య క్రమంలో పాల్గొంటారని తెలిపారు.
Andhra Pradesh
Health Department
Pulse Polio
Minister Satyakumar
Polio Drops
Child Health
ఐదేళ్లలోపు పిల్లలు
టీకాకరణ బూత్‌లు
ఇంటింటి పోలియో కార్యక్రమం
Scroll for the next article