News20th Dec 03:08 PMSunil Byrisetty1 min read

రేపే పల్స్ పోలియో.. తల్లిదండ్రులూ మర్చిపోవద్దు

పసిబిడ్డలున్న తల్లిదండ్రులు రేపు ముఖ్యమైన పని చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని

రేపే పల్స్ పోలియో.. తల్లిదండ్రులూ మర్చిపోవద్దు
పసిబిడ్డలున్న తల్లిదండ్రులు రేపు ముఖ్యమైన పని చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్య కుమార్ సూచించారు. రాష్ట్రంలోని 54,07,663 మంది చిన్నారులకు 38,267 బూత్‌లను ఏర్పాటు చేశారు. 61,26,120 డోసులను ఇప్పటికే జిల్లాలకు సరఫరా చేశారు. ఏదైనా కారణంతో రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు.
Andhra Pradesh
Child Health
Pulse Polio
Polio Drops
Health Department
Minister Satya Kumar
టీకాకరణ కార్యక్రమం
ఐదేళ్లలోపు పిల్లలు
Scroll for the next article