News30th May 11:19 AMSunil Byrisetty1 min read
సింహాచలంలో అత్యంత వైభవంగా పునర్వసు హోమం
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం పరిధిలోని సింహగిరిపై గల గంగధార సమీపంలో గల ఉప ఆలయం రామాలయంలో శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం పురస్కరించుకొని శ్రీ
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం పరిధిలోని సింహగిరిపై గల గంగధార సమీపంలో గల ఉప ఆలయం రామాలయంలో శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం పురస్కరించుకొని శ్రీరామ షడక్షరి, సంక్షిప్త రామాయణం పారాయణం అత్యంత వైభవంగా జరిపించారు. ప్రతి నెల శ్రీరాముని జన్మనక్షత్రం పునర్వసు నక్షత్రం పురస్కరించుకొని శ్రీ స్వామివారి ఉపాయాలయమైన రామాలయంలో పునర్వసు హోమం అత్యంత వైభముగా జరుగుతోంది. హోమం సందర్భంగా శ్రీరాముని సంక్షిప్త రామాయణం పారాయణం శ్రీరాముని షడక్షరి పారాయణం స్వామివారి ఆలయ వేద పండితులు, అర్చక స్వాములు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులందరూ ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవాలని కోరారు. బాలరాముని స్మరించుకుంటూ శ్రీ సంక్షిప్త రామాయణం, శ్రీరాముని షడక్షరి పారాయణ కార్యక్రమంలో ఉద్యోగులు, భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.