Business Type21st Aug 05:28 PMSunil Byrisetty1 min read
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం
పట్టణంలోని కళామందిర్ సెంటర్, గౌరీ శంకర్ టవర్స్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నూతన శాఖ ఘనంగా ప్రారంభమైంది. విజయవాడ సర్కిల్ డీజీఎం, సర్కిల్ హెడ్ కవితా ఫ్రాంక్ ముఖ్య అతిథిగా హాజరై ఈ
పట్టణంలోని కళామందిర్ సెంటర్, గౌరీ శంకర్ టవర్స్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నూతన శాఖ ఘనంగా ప్రారంభమైంది. విజయవాడ సర్కిల్ డీజీఎం, సర్కిల్ హెడ్ కవితా ఫ్రాంక్ ముఖ్య అతిథిగా హాజరై ఈ శాఖను ప్రారంభించారు. ప్రజలు, రైతులు, వ్యాపారుల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సేవలు అందిస్తామని, ఈ నూతన శాఖతో విజయవాడ సర్కిల్ పరిధిలో బ్రాంచ్‌ల సంఖ్య 82కి చేరిందని తెలిపారు. స్థానిక ప్రజలు ఈ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బ్రాంచ్ హెడ్ పి. నారయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీఎంలు రామనాథన్, సతీష్, యూనియన్ ప్రతినిధులు ధన్వంత్, స్థానిక ప్రముఖులు డాక్టర్ కొమ్మినేని వీర శంకర్, సాధినేని హనుమంత్ రావు, ఆదినారాయణ రెడ్డి, శిల్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.