News19th Aug 10:33 AMSunil Byrisetty1 min read
పున్నం మాంగనీస్ బ్లాక్ వేదాంతకే
ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా పున్నం మాంగనీస్ బ్లాక్‌ను వేదాంత లిమిటెడ్‌కు కేటాయించింది. గనులు, భూగర్భవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు
ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా పున్నం మాంగనీస్ బ్లాక్‌ను వేదాంత లిమిటెడ్‌కు కేటాయించింది. గనులు, భూగర్భవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. పున్నం మాంగనీస్ బ్లాక్ 152 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. దానికి సంబంధించి వేదాంత లిమిటెడ్‌కు కాంపోజిట్ లైసెన్స్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది నిర్వహించిన వేలంలో వేదాంత ఎల్1గా నిలిచింది. అయితే మొత్తం 152 హెక్టార్లలో 12.08 హెక్టార్లు ప్రభుత్వ భూమి కాగా, 139.91 హెక్టార్లు పట్టా భూమి కావడంతో సంబంధిత భూ యజమానుల అనుమతి పొందాల్సి ఉంది. భూయజమానుల అంగీకారంతోనే అన్వేషణ పనులు చేపట్టి, చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తామని వేదాంత అఫిడవిట్‌లో పేర్కొందని తెలిపింది. మినరల్ ఆక్షన్ రూల్స్ ప్రకారం లైసెన్స్ మంజూరు చేసిన ప్రభుత్వం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, అనుమతులు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.