Politics17th Aug 04:49 PMSunil Byrisetty1 min read

బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి

బీజేపీ జాతీయస్థాయిలో సంస్థాగత మార్పులు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించాక పార్టీలో సంస్కరణలు ప్రారంభించారు. తనదైన కొత్త బృందాన్ని ఇప్పుడు ప్రకటించారు

బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి
బీజేపీ జాతీయస్థాయిలో సంస్థాగత మార్పులు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించాక పార్టీలో సంస్కరణలు ప్రారంభించారు. తనదైన కొత్త బృందాన్ని ఇప్పుడు ప్రకటించారు. కొత్త బృందంలో 13 మందికి సీనియర్ నాయకులకు చోటు కల్పించారు. వీరిలో పలువురు ఏపీ నేతలు ఉన్నారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న పురంధేశ్వరికి జాతీయ పార్టీ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. మరో తెలుగు నేత రాంమాధవ్‌కు ఉపాధ్యక్ష పదవి వరించింది. వసుంధర రాజే కూడా ఉపాధ్యక్షురాలిని చేశారు. జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీకి చోటు కల్పించారు. మరో కీలక తెలుగు యువ నేత విష్ణువర్దన్ రెడ్డికి జాయింట్ కో ఆర్డినేటర్ పదవి ఇచ్చారు. బీజేపీ జాతీయ కమిటీలో పార్టీ జెన్-జి, మహిళా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. యువతకు, మహిళలకు కీలక పాత్రల్లో అవకాశాలు కల్పించారు. 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులకు కూడా కీలక పదవులు ఆఫర్ చేశారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌ ఎన్నికల దృష్ట్యా ఈ నియామకాలు చేపట్టారు.
Andhra Pradesh
Daggubati Purandeswari
BJP
Bharatiya Janata Party
BJP National Leadership
Nitin Nabin
Rajahmundry MP
Ram Madhav
స్మృతి ఇరానీ
విష్ణువర్దన్ రెడ్డి
బీజేపీ నియామకాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
జాతీయ రాజకీయాలు
Scroll for the next article