Movie Reviews19th Apr 09:55 AMSunil Byrisetty1 min read
పుష్ప.. పుష్పరాజ్.. అంతా ఎడిటింగేలే!
పాన్ ఇండియా సినిమా పుష్ప 2 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ విజయం వెనుక భారీ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అయితే తాజాగా విడుదలైన ఓ బిహైండ్ ద
పాన్ ఇండియా సినిమా పుష్ప 2 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ విజయం వెనుక భారీ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి.
అయితే తాజాగా విడుదలైన ఓ బిహైండ్ ది సీన్స్ వీడియో మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సినిమాలో కనిపించిన అడవులు, బోటింగ్ ఎపిసోడ్, జపాన్ ఫైట్ సీన్, మాల్దీవుల్లో జరిగిన డీలింగ్ లాంటి ముఖ్యమైన సన్నివేశాలన్నీ నిజం కాదట.
అవన్నీ వీఎఫ్‌ఎక్స్ మాయాజాలమని సుకుమార్ రైటింగ్స్ సంస్థ విడుదల చేసిన వీడియోలో తెలుస్తోంది.
మొత్తం గ్రీన్ మ్యాట్ మీద స్టూడియోలో చిత్రీకరించి, తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో వాస్తవంలా చూపించారు.
వీఎఫ్‌ఎక్స్‌లాగా అనిపించనే లేదని, ఈ వీడియో నిజాలేంటో చూపిందని నెటిజన్లు స్పందిస్తున్నారు.
టెక్నాలజీని ఎలా అద్భుతంగా వినియోగించాలో చూపించిన సుకుమార్‌కే ఈ క్రెడిట్ దక్కుతుందంటున్నారు.
ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించడంతో దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి తీసుకెళ్లారని చెబుతున్నారు.