Politics6th Sep 11:24 AMSunil Byrisetty1 min read
కాంగ్రెస్ ఇంచార్జిగా పీవీ మోహన్
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, పునర్వైభవం తెచ్చేందుకు జాతీయ నాయకత్వం కీలక నియామకం చేపట్టింది. ఏఐసీసీ జారీ చేసిన నూతన సంస్థాగత ఉత్తర్వులు ఏపీ కాంగ్రెస్ శ్రేణు
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, పునర్వైభవం తెచ్చేందుకు జాతీయ నాయకత్వం కీలక నియామకం చేపట్టింది. ఏఐసీసీ జారీ చేసిన నూతన సంస్థాగత ఉత్తర్వులు ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. తమిళనాడు బాధ్యతలకు మాణికం ఠాకూర్‌ను పంపి, ఏపీ కాంగ్రెస్ ఇంచార్జిగా సీనియర్ వ్యూహకర్త, కర్ణాటకకు చెందిన పీవీ మోహన్‌ను నియమించింది. కర్ణాటక రాజకీయాల నుంచి వచ్చి ఏఐసీసీ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న మోహన్, పోరాటాలకు, సంస్థాగత నిర్మాణానికి మారుపేరుగా గుర్తింపు పొందారు. ఏఐసీసీ పరిశీలకుడిగా, కార్యదర్శిగా వివిధ రాష్ట్రాల్లో ఆయన సాధించిన విజయాలు ఏపీ కాంగ్రెస్‌లో ఆశలు రేపుతున్నాయి. కేరళ, లక్షద్వీప్ వంటి చోట్ల ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో, అంతర్గత విభేదాలను సరిదిద్ది పార్టీ యంత్రాంగాన్ని ఒకే తాటిపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ ను మోహన్ నిలబెడతారని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.