Politics7th Aug 12:21 PMSunil Byrisetty1 min read

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీ

ఒంగోలులో నిర్వహించిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో వాణిజ్య రంగం సంక్షోభంలో ఉండడంతో పొగాకు పంటకు మంచి ధర లభించిందని తెలిపారు. త

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీ
ఒంగోలులో నిర్వహించిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో వాణిజ్య రంగం సంక్షోభంలో ఉండడంతో పొగాకు పంటకు మంచి ధర లభించిందని తెలిపారు. తద్వారా తదుపరి ఏడాదిలో పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాల్సిన సమయం ఇదని చెప్పారు. ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయని, ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో మెరుగైన పరిపాలన జరుగుతోందన్నారు. లిక్కర్ స్కాంలో ఎంత పెద్ద తలకాయలు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. అరువు తెచ్చుకున్న జనాలతో జగన్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మాధవ్ స్పష్టం చేశారు.
Andhra Pradesh
PVN Madhav
BJP
Chai Pe Charcha
Tobacco Farming
Alternative Crops
AP Politics
YSRCP Criticism
Liquor Scam
Local Body Elections
స్థానిక సంస్థల ఎన్నికలు
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీ
Scroll for the next article