News26th Jun 03:55 PMSunil Byrisetty1 min read

ఫిర్యాదుల కోసం రేషన్ షాప్‌ల వద్ద 'క్యూఆర్'!

రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి రేషన్ షాప్‌ వద్ద ‘క్యూఆర్ కోడ్‌’ పోస్టర్లను ఏర్పాటు చేసింది. రేషన్‌ కార్డు దారులు ఆ క్యూఆర

ఫిర్యాదుల కోసం రేషన్ షాప్‌ల వద్ద 'క్యూఆర్'!
రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి రేషన్ షాప్‌ వద్ద ‘క్యూఆర్ కోడ్‌’ పోస్టర్లను ఏర్పాటు చేసింది. రేషన్‌ కార్డు దారులు ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియచేయవచ్చు. అభిప్రాయాలు, ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వెబ్ ఫారమ్‌లో సరైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన స్పందనలు నేరుగా ఉన్నతాధికారులకు చేరుతాయి. అప్పుడు డీలర్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. క్యూఆర్ కోడ్‌ ఫారమ్‌లో ప్రశ్నలు ఇలా: # ఈ నెల రేషన్ తీసుకున్నారా? # సరుకుల నాణ్యతపై సంతృప్తిగా ఉన్నారా? # సరైన తూకంతో సరఫరా చేశారా? # డీలర్ మర్యాదగా వ్యవహరించాడా? # ఎటువంటి అధిక ధరలు వసూలు చేశారా?
Andhra Pradesh news
Ration Shops
Qr code posters
nandendla manohar
Complaints
రేషన్ షాప్‌ల వద్ద క్యూఆర్ కోడ్‌ పోస్టర్లు
అభిప్రాయాలు
ఫిర్యాదులు
Scroll for the next article