News30th Aug 12:55 PMSunil Byrisetty1 min read

ప్రతి బస్తాకి క్యూ ఆర్ కోడ్ ట్యాగ్

రేషన్ మాఫియా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ ప్రతి బస్తాకి క్యూ ఆర్ కోడ్ ట్యాగ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అక్రమ రేషన్ పట్టుబడితే బస్తాలు క్యూ ఆర్

ప్రతి బస్తాకి క్యూ ఆర్ కోడ్  ట్యాగ్
రేషన్ మాఫియా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ ప్రతి బస్తాకి క్యూ ఆర్ కోడ్ ట్యాగ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అక్రమ రేషన్ పట్టుబడితే బస్తాలు క్యూ ఆర్ కోడ్ ట్యాగ్ తో ఎక్కడివనేది సులువుగా గుర్తించడం సాధ్యమవుతుంది. క్యూ ఆర్ కోడ్ విధానాన్ని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు పరిశీలించారు. రేషన్ పంపిణి చేసే ముందు బస్తాలను డీలర్లు స్కాన్ చేస్తారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్యూ ఆర్ కోడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రజా పంపిణీలో కార్డు దారులకు పారదర్శకంగా బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh
AP Government
Ration Rice
QR Code Tags
Ration Mafia
Civil Supplies Department
Ration Distribution
Rice Distribution
Food Security
PDS
ప్రజా పంపిణీ వ్యవస్థ
పారదర్శకత
రేషన్ డీలర్లు
కన్నబాబు
ఏపీ వార్తలు
ప్రభుత్వ పథకాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article