Education4th Nov 04:13 PMSunil Byrisetty1 min read
వైద్య విద్యలో నాణ్యతతోనే సమర్థులైన వైద్యుల తయారీ
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడం ద్వారా వైద్య పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలు, నైతిక విలువలు, మానవీయ దృక్పథం కలిగిన సమర్థులైన వైద్యులను సమాజానికి అందించగలమని శ్ర
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడం ద్వారా వైద్య పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలు, నైతిక విలువలు, మానవీయ దృక్పథం కలిగిన సమర్థులైన వైద్యులను సమాజానికి అందించగలమని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) సంచాలకులు, ఉపకులపతి డా. గూడారు జగదీష్ పేర్కొన్నారు. స్విమ్స్ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో జాతీయ వైద్య కమిషన్ (NMC) మార్గదర్శకాల ప్రకారం నవంబర్ 4, 5 తేదీలలో నిర్వహిస్తున్న రెండు రోజుల కరికులం ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్ (CISP-III) శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించి ప్రసంగించారు. ఆధునిక వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా వైద్య విద్యాబోధనలో కూడా గణనీయమైన మార్పులు అవసరమని తెలిపారు. జాతీయ వైద్య కమిషన్ ప్రవేశపెట్టిన కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CBME) విధానం వైద్య విద్యలో అత్యంత ముఖ్యమైన సంస్కరణ అని పేర్కొన్నారు.
వైద్య విద్యలో ఎన్ని నూతన పాఠ్య ప్రణాళికలు ప్రవేశపెట్టినా వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధ్యాపకులపైనే ఉంటుందని తెలిపారు.