News12th Oct 03:46 PMSunil Byrisetty1 min read
పుష్కరాల పనుల్లో నాణ్యతకు పెద్దపీట.
గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకినాడలో
గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకినాడలో జిల్లా ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనుల పురోగతిని సమీక్షించారు. గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రూ.174 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ పనుల్లో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసిన నేపథ్యంలో ఎన్డీబీ (NDB) రహదారి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఏడీబీ (ADB) రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సీఆర్ఐఎఫ్ (CRIF) నిధులతో చేపడుతున్న రహదారి పనుల్లోనూ వేగం పెంచాలని తెలిపారు. రహదారుల నిర్మాణానికి సంబంధించి ఎక్కడైనా భూసేకరణ సమస్యలు ఎదురైతే, వాటిని టాస్క్ఫోర్స్ కమిటీ ద్వారా పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.