News3rd Oct 05:45 PMSunil Byrisetty1 min read
ప్రశ్నలు అడుగుతారు.. అడిగితే తట్టుకోలేరు!
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై నటుడు ప్రకాష్ రాజ్ ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ ప్రారంభించిన ఉద్యమం, ఆయన
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై నటుడు ప్రకాష్ రాజ్ ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ ప్రారంభించిన ఉద్యమం, ఆయనలోని తీవ్ర నిరాశానిస్పృహలను బయటపెట్టింది. సినీ నటుడిగా తనకు గుర్తింపు ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ , ఈసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో తన రాజకీయ ఎజెండాను ఏకపక్షంగా వినిపించే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడే ప్రకాష్ రాజ్‌కు విలేకరుల నుంచి వాస్తవిక ప్రశ్నలు ఎదురయ్యేసరికి సహనం నశించి ఆగ్రహంతో ఊగిపోయారు. మీడియా ప్రతినిధులు ఎస్ఐఆర్ నిబంధనలు, సాంకేతిక అంశాలపై వివరణ కోరగానే తీవ్ర అసహనానికి లోనయ్యారు. ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు దంచే ప్రకాష్ రాజ్, మీడియా అడిగే సహేతుకమైన ప్రశ్నలను ఏమాత్రం స్వీకరించలేకపోయారు. విలేకరులపైనే ఎదురుదాడికి దిగుతూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, విచక్షణ కోల్పోయి బీజేపీ నా కొడుకులు అంటూ జుగుప్సాకరమైన, బూతు పదజాలంతో విరుచుకుపడ్డారు.