News15th Sep 04:35 PMSunil Byrisetty1 min read
ఎక్సైజ్ కమిషనర్‌గా రాహుల్ దేవ్
ఎక్సైజ్ ఈడీకి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మకు ఎక్సైజ్ కమిష
ఎక్సైజ్ ఈడీకి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మకు ఎక్సైజ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాహుల్ దేవ్ శర్మ ఇకపై డైరెక్టర్, ఎక్సైజ్ & ప్రొహిబిషన్; మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్; కమిషనర్, డిస్టిలరీస్ & బ్రూవరీస్ హోదాలలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ తాత్కాలిక నియామకం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.