Sports31st Aug 11:53 AMSunil Byrisetty1 min read
చీఫ్ కోచ్ నుంచి వైదొలగిన ద్రవిడ్!
ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ చీఫ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ యాజమాన్యం ప్రకటించింది. ‘పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ద్రవిడ్‌కు ఉన్నతమై
ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ చీఫ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ యాజమాన్యం ప్రకటించింది. ‘పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ద్రవిడ్‌కు ఉన్నతమైన స్థానం కోసం ప్రతిపాదించాం. కానీ, అతడు దానిని తిరస్కరించాడు. జట్టును వీడాలనుకొన్నాడు’ అని ఎక్స్‌లో రాజస్థాన్ పోస్టు చేసింది. గతేడాది టీమిండియా కోచ్‌గా కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత.. రాజస్థాన్ కోచ్‌గా ద్రవిడ్ నియమితులయ్యారు. అయితే కొత్త కెప్టెన్ విషయంలో యాజమాన్యంతో ద్రవిడ్ విభేదించాడనే వార్తలు వినవస్తున్నాయి. అందుకే కోచ్ పదవి నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.