National25th Jul 12:31 PMSunil Byrisetty1 min read
అన్నీ మూసేస్తారు.. లీక్‌ను మాత్రం ఆపలేరు!
కేంద్రంపై మరోసారి రాహుల్‌గాంధీ ఫైరయ్యారు. విద్యార్థులు ప్రతిపాదించిన మూడు డిమాండ్లను నెరవేర్చాల్సిందేనన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ అత్యంత అవినీతి పరుడని, తక్షణమే విద్యాశాఖ మంత్రిగా రా
కేంద్రంపై మరోసారి రాహుల్‌గాంధీ ఫైరయ్యారు. విద్యార్థులు ప్రతిపాదించిన మూడు డిమాండ్లను నెరవేర్చాల్సిందేనన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ అత్యంత అవినీతి పరుడని, తక్షణమే విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని తీవ్ర ఆరోపణలు చేశారు. ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేసేంతవరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, రోడ్లు, షాపుల మూసివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ మూసేస్తారు.. కానీ లీక్ ను మాత్రం ఆపలేరంటూ సెటైర్లు వేశారు. తమ హక్కుల కోసం విద్యార్థులు పోరాడుతున్నారని, విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ అన్నారు.