Politics1st Aug 05:10 PMSunil Byrisetty1 min read
జగన్‌ను ఫాలో అవుతున్న రాహుల్ గాంధీ
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అక్రమాలు చేసిన అధికారులను రిటైరైనా వదిలిపెట్టబోమని తరచుగా జగన్ హెచ్చరిస్తున్న విషయం
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అక్రమాలు చేసిన అధికారులను రిటైరైనా వదిలిపెట్టబోమని తరచుగా జగన్ హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అదే తరహాలో తాజాగా రాహుల్‌గాంధీ సైతం ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందని, ఎన్నికల సంఘం అక్రమాలపై పూర్తి ఆధారాలున్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీ కోసం ఈసీ ఓట్లు చోరీ చేస్తోందన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగిందని, కొత్తగా కోటి ఓట్లు చేర్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీ అక్రమాలపై ఆరు నెలలపాటు దర్యాప్తు చేశామని, అణుబాంబు లాంటి ఆధారాలు మా వద్ద ఉన్నాయని, అణుబాంబు పేలితే ఎన్నికల సంఘమే ఉండదని పేర్కొన్నారు. ఈసీలో అక్రమాలకు పాల్పడిన ఏ స్థాయి అధికారినైనా వదిలిపెట్టబోమని, అక్రమాలు చేసిన అధికారులను రిటైరైనా వదిలిపెట్టమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.