Politics5th Nov 12:14 PMSunil Byrisetty1 min read

రాహుల్ కులకలం.. సైన్యంపైనా వ్యాఖ్యలు!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులం చుట్టూ తిరుగుతున్నారు. అందాల పోటీల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కడ ఉంటున్నారు.. అందరూ అగ్రవర్ణాల వారే అని ఆ మధ్య రాహుల్ గాంధీ బాధపడిపోయారు. ఇప్ప

రాహుల్ కులకలం.. సైన్యంపైనా వ్యాఖ్యలు!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులం చుట్టూ తిరుగుతున్నారు. అందాల పోటీల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కడ ఉంటున్నారు.. అందరూ అగ్రవర్ణాల వారే అని ఆ మధ్య రాహుల్ గాంధీ బాధపడిపోయారు. ఇప్పుడు ఆయన ఇంకాస్త దిగజారిపోయారు. ఏకంగా సైన్యానికి కులం అంటించి.. పది శాతం కులాలకు చెందిన వారే అంతా నడిపిస్తున్నారని.. అంటున్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. దేశంలో 10 శాతం మంది ఆర్మీ, న్యాయస్థానాలను నియంత్రిస్తున్నారని, మిగిలిన 90 శాతం అవకాశం కోల్పోతున్నారని ఆరోపించారు. కులం గురించి మాట్లాడితే ఓట్లు వస్తాయనే భ్రమలో ప్రతి రంగాన్ని కులం పరిధిలోకి తీసుకువస్తున్నారు రాహుల్.
India News
Rahul Gandhi
Caste Politics
Bihar Elections
Indian Army
Judiciary
Congress
Political Controversy
Rahul Remarks
Caste Debate
ఎన్నికల ప్రచారం
కుల ఆధారిత వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా చర్చ
సైన్యంపై వ్యాఖ్యలు
Scroll for the next article