News4th Dec 11:51 AMSunil Byrisetty1 min read

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాహుల్ గాంధీ!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆందోళనలను కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శిస్తారని AICC అధ

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాహుల్ గాంధీ!
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆందోళనలను కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శిస్తారని AICC అధికార ప్రతినిధి సునీల్ అహీరా తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోహినూర్ వజ్రం లాంటిదని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇచ్చిన ప్లాంటును బీజేపీ అదానీకి అమ్మేస్తోందని, దాన్ని అడ్డుకుంటామని తెలిపారు. అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. రాహుల్ పర్యటన ఖరారు కానున్న నేపథ్యంలో ఏపీసీసీ అందుకు ఏర్పాట్లు ప్రారంభిస్తోంది.
Andhra Pradesh
VSP
AICC
Visakhapatnam Steel Plant
Rahul Gandhi
Congress Party
Vizag
ఏఐసీసీ
రాజకీయ వార్తలు
స్టీల్ ప్లాంట్ ఆందోళనలు
Scroll for the next article